చట్టబద్ధంగా వచ్చినవారిని ఇప్పుడు అనవసరమైన వారుగా ఎందుకు చూస్తున్నారు? : జేడీ వాన్స్‌ను ప్రశ్నించిన ఎన్నారై యువతి

الجمعة، 31 أكتوبر 2025

international NRI woman questions JD Vance video going viral on social media Why are legal immigrants now seen as unnecessary?

t f B! P L


మెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను ఓ ఎన్నారై యువతి అడిగిన ప్రశ్నలకు  ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మిసిసిప్పీ విశ్వవిద్యాలయంలో జరిగిన ''టర్నింగ్‌ పాయింట్‌ యూఎస్‌ఏ'' కార్యక్రమంలో కఠిన వలస విధానాల అవసరాన్ని వాన్స్‌ సమర్థించారు. చట్టబద్ధంగా వచ్చిన వలసదారుల ప్రవాహం కూడా అమెరికా సమాజాన్ని దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించారు. అయితే, సభలో భారతీయ మూలాలున్న యువతి ప్రశ్నలతో వాన్స్‌ను నిలదీశారు. అమెరికా కలలను నమ్మి చదువుకున్న, చట్టబద్ధంగా వచ్చినవారిని ఇప్పుడు ''అనవసరమైన వారుగా'' ఎందుకు చూస్తున్నారు? అని ఆమె గట్టిగా ప్రశ్నించారు. ఆమె మాటలకు హాజరైన విద్యార్థుల నుంచి చప్పట్లు వినిపించాయి. ఆ యువతి ఉద్వేగభరితంగా మాట్లాడుతూ వలసదారుల పాత్రను గుర్తించి, వారిని వెనక్కి నెట్టే విధానాలపై ప్రశ్నలు లేవనెత్తింది. వాన్స్‌ ఉద్దేశం వలసదారుల ప్రవాహాన్ని నియంత్రించడం మాత్రమేనని చెప్పినా, సమాధానం కొంత రక్షణాత్మకంగా అనిపించింది. తరువాత ఆమె, ''అమెరికాను ప్రేమించాలంటే క్రిస్టియన్‌ కావాలా?'' అని ఆలోచింపజేసే ప్రశ్న వేసింది. దానికి వాన్స్‌ తన మత విశ్వాసాన్ని గౌరవిస్తానని, భవిష్యత్తులో తన భార్య కూడా అదే దారిలో నడుస్తారని ఆశిస్తున్నానని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో ఘాటు చర్చకు దారితీశాయి. ఇండో-అమెరికన్‌ సమాజం వాన్స్‌ ద్వంద్వ వైఖరిని విమర్శిస్తోంది. భారతీయ సంప్రదాయ పద్ధతిలో ఆయన పెళ్లి జరిగిందంటూ, మత స్వేచ్ఛపై వ్యాఖ్యలు చేయడం ఆయన వ్యక్తిగత-సామాజిక విలువల మధ్య వ్యతిరేకతగా పలువురు అభిప్రాయపడ్డారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ