దేశీయ మార్కెట్లో ఈ రోజు Huawei GT5 ప్రో వాచ్ విడుదల చేసింది. ఈ వాచ్‌ని అందరు ఇష్టపడే విధంగా రూపొందించారు. అలాగే ఫీచర్స్ సైతం అదిరిపోయాయి.ఇది ప్రీమియం స్మార్ట్ వాచ్ టైటానియం ఎడిషన్‌తో పాటు బ్లాక్ ఎడిషన్. రెండు వేరియంట్‌లలో ఇది వచ్చింది. ఈ రెండు వేరియంట్‌లు ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రసిద్ధ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో లభ్యమవుతున్నాయి. ప్రో లెవెల్ స్పోర్ట్స్ మోడ్, ECG మానిటరింగ్, GPSతో పాటు 14 రోజుల బ్యాటరీ లైఫ్‌తో సహా అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. వాచ్ GT5 ప్రో 1.43 అంగుళాల AMOLED డిస్ ప్లేతో లభ్యమవుతోంది. ఎల్లప్పుడూ డిస్ ప్లే మోడ్‌లో స్మార్ట్‌వాచ్‌లో కూడా అందుబాటులో ఉంది. ఇది బ్లూటూత్ 5.2 కనెక్టివిటీతో వస్తుంది. 11 కొత్త వాచ్ ఫేస్ థీమ్, ప్రో-లెవల్ స్పోర్ట్స్ ట్రాకింగ్ - గోల్ఫ్, డైవింగ్‌తోపాటు ట్రయిల్ రన్‌తో సహా 100+ స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తోంది. ఈ స్మార్ట్‌వాచ్ గుండె స్పందన రేటు, ఉష్ణోగ్రతను ట్రాక్ చేయడంలో సైతం సహాయపడుతుంది. అలాగే బేరోమీటర్ సెన్సార్, ECG తోపాటు మరిన్ని అంశాలను ఈ వాచ్ కలిగి ఉంది. స్మార్ట్ వాచ్14 రోజుల వరకు బ్యాటరీ జీవితాన్ని అందిస్తుంది. వాచ్‌లో అల్ట్రా-హార్డ్ కోటింగ్‌లతోపాటు నానో ఫిల్మ్ వాటర్ ప్రూఫ్ ఫినిషింగ్ సైతం ఈ వాచ్‌ల ప్రత్యేకత. ఈ వాచ్‌లు నీటిలో తడిసినా ఏం కాదు.. తుప్పు సైతం వీటికి పట్టదు. ఇక బ్లూ టూత్ కాలింగ్‌తోపాటు టెక్స్ట్ రిప్లై ఫంక్షన్‌లను సైతం కలిగి ఉంది.
0 Comments