Ad Code

అంబులెన్స్ సేవలను ప్రారంభించిన బ్లింకిట్ !


బ్లింకిట్ అంబులెన్స్ సేవలను గురువారం ప్రారంభించింది. తొలిదశలో గురుగ్రామ్ లో ఐదు అంబులెన్స్ లతో ఈ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ఆ కంపెనీ సీఈఓ అల్బీందర్ దిండ్సా వెల్లడించారు. ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో అంబులెన్స్ వరకు సంబంధించిన మరిన్ని వివరాలను షేర్ చేశారు. మన నగరాలలో వేగమంతమైన నమ్మకమైన అంబులెన్స్ సేవలను అందించే దిశగా అంబులెన్స్ సర్వీస్ లను ప్రారంభిస్తున్నట్లు దిండ్సా పేర్కొన్నారు. దీనిలో భాగంగానే గురుగ్రాంలో ఐదు అంబులెన్స్ సర్వీస్ లను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో వీటిని మరింత విస్తరించినట్లు వెల్లడించారు. బేసిక్ లైఫ్ సపోర్ట్ కలిగిన ఈ అంబులెన్స్లను బ్లింకిట్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ అంబులెన్స్ లో ఆక్సిజన్ సిలిండర్, స్ట్రక్చర్ మానిటర్, సెక్షన్ మెషిన్, అత్యవసర మందులు, ఇంజక్షన్లు అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు. ఒక్కో అంబులెన్స్ లో పారామెడికో, ఒక సహాయకారి, డ్రైవర్ ఉంటారని తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో రోగులకు వీరు సేవలందిస్తారు అని ఆయన తెలిపారు. లాభార్జన తమముఖ్య ఉద్దేశం కాదని కస్టమర్లకు అందుబాటు ధరలో అంబులెన్స్ అందించడం తమ అంతిమ లక్ష్యం అని వివరించారు. రాబోయే రెండేళ్లలో అన్ని ప్రధాన నగరాలకు ఈ సర్వీస్ లను విస్తరించాలనుకున్నట్లు తెలిపారు. బ్లింకిట్ ఆలోచనపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మంచి ఆలోచన అంటూ కొనియాడుతున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu