ఆస్కార్ 2025 వేడుక మార్చి 2న ఓవేషన్ హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగనుంది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ ఏడాది ఆస్కార్‌కు అర్హత సాధించిన 323 చలన చిత్రాల జాబితాను వెల్లడించింది. వీటిలో 207 చిత్రాలు ప్రతిష్టాత్మకమైన ఉత్తమ చిత్రం విభాగంలో పోటీలో నిలిచాయి. పోటీలో నిలిచిన వాటిలో ఆరు భారతీయ చిత్రాలు కూడా ఉన్నాయి. 97వ అకాడమీ అవార్డ్స్ నామినేషన్లకు అర్హత సాధించిన సినిమాల జాబితాను అకాడమీ సంస్థ జనవరి 7న విడుదల చేసింది. ఇండియా నుంచి ప్రస్తుతం ఆస్కార్ 2025 కోసం షార్ట్ లిస్ట్ చేసిన సినిమాల్లో ఆడు జీవితం (మళయాలం), కంగువా, సంతోష్ (హిందీ), స్వతంత్ర్య వీర సావర్కర్ (హిందీ), ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ (హిందీ) సినిమాలు నిలిచాయి. కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన లాపతా లేడీస్ కూడా ఆస్కార్ 2025 రేసులో నిలిచింది. కానీ అది షార్ట్ లిస్ట్ మాత్రం అవ్వలేకపోయింది. సినీ పరిశ్రమకు సంబంధించినంత వరకు ఆస్కార్ అవార్డ్ గెలవడం మాత్రమే కాదు ఆస్కార్ బరిలో నిలవడం కూడా గొప్ప విషయమే. నామినేషన్ల కోసం ఓటింగ్ జనవరి 8న ప్రారంభమవుతుంది. జనవరి 12న ముగుస్తుంది. అకాడమీ తుది నామినేషన్‌లను జనవరి 17న ప్రకటించనుంది. దీంతో ఈ ఐదు సినిమాల్లో ఏదైనా ఒకదానికైనా నామినేషన్ దక్కుతుందా అని భారతీయ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్లకు అర్హత సాధించిన ఆరు భారతీయ చిత్రాలు !
الثلاثاء، 7 يناير 2025
international national ఆడు జీవితం (మళయాలం) ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ (హిందీ) ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్లకు అర్హత సాధించిన ఆరు భారతీయ చిత్రాలు కంగువా సంతోష్ (హిందీ) స్వతంత్ర్య వీర సావర్కర్ (హిందీ)
ليست هناك تعليقات:
إرسال تعليق