పాకిస్థాన్‌పై ఆప్ఘనిస్థాన్ ప్రతీకార దాడులకు దిగింది. దీనిలో భాగంగా పాక్‌లోని కొన్ని స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపింది. ఈ విషయాన్ని ఆప్ఘనిస్థాన్ రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ''పాకిస్థాన్‌పై ఆప్ఘనిస్థాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఆ దేశంలోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు, రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాం'' అని రక్షణ శాఖ ప్రతినిధి ఇనాయాతుల్లా క్వార్జామి 'ఎక్స్' (ట్విటర్) వేదికగా వెల్లడించారు. పాక్‌పై ఈ దాడులు ఎలా చేశారు. దీనిలో ఎంతమంది మరణించారనే అంశాలను ప్రతినిధి ప్రస్తావించలేదు. అయితే.. తాలిబన్లకు మద్దతు గల ఓ మీడియా సంస్థ మాత్రం.ఈ దాడుల్లో 19 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారని కథనంలో పేర్కొంది. తాలిబన్ల దాడులపై ఇప్పటివరకు పాక్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కాగా ఆప్ఘనిస్థాన్ ను తాలిబన్‌లు ఆక్రమించుకున్న తర్వాత సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల తమ దేశంలో జరిగిన పలు ఉగ్రదాడులకు తాలిబన్లే కారణమని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను తాలిబన్ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో ఆప్ఘనిస్థాన్ పై దాడులు చేసిన పాక్.. ఇటీవల మరోసారి వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 46 మంది ప్రాణాలు కోల్పోగా పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నట్లు తాలిబన్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ దాడులపై పాక్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు.
పాకిస్థాన్‌పై ఆప్ఘనిస్థాన్ ప్రతీకార దాడులు !
السبت، 28 ديسمبر 2024
19 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారని కథనం international పాకిస్థాన్‌పై ఆప్ఘనిస్థాన్ ప్రతీకార దాడులు రక్షణ శాఖ ప్రతినిధి ఇనాయాతుల్లా క్వార్జామి 'ఎక్స్' వేదికగా వెల్లడి
ليست هناك تعليقات:
إرسال تعليق