గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబును పరామర్శించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంపీడీవో కార్యాలయాన్ని పరిశీలించారు. అక్కడ పని చేస్తున్న సిబ్బందికి ధైర్యం చెప్పారు. కార్యాలయం వద్దే మీడియాతో మాట్లాడారు. ''చాలా కార్యక్రమాలను రద్దు చేసుకొని గాలివీడుకు వచ్చాను. తలుపులు మూసి ఎంపీడీవోపై దాడి చేయడం దారుణం. ముఠాలతో భయపెడితే మాది భయపడే ప్రభుత్వం కాదు. మార్పు కోసమే ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకొన్నారు. అభివృద్ధికి ఎవరు అడ్డుగోడలు కట్టినా బద్దలుగొట్టే శక్తి మాకుంది. దాడి చేసినవారు ఎక్కడున్నా లాక్కొచ్చి జైల్లో పడేస్తాం. దాడికి పాల్పడిన సుదర్శన్ రెడ్డి అనుచరులు అందరినీ జైలుకు పంపిస్తాం. సోషల్ మీడియాలో పిచ్చికూతలు కూసినా తీవ్ర పరిణామాలు ఎదర్కోవాల్సి ఉంటుంది'' అని హెచ్చరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్టుపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి పవన్ కల్యాణ్ స్పందిస్తూ ''సమస్యలు చాలా ఉన్నాయి, సినిమా అనేది చిన్న సమస్య. బాధితుడి పరామర్శకు వచ్చినప్పుడు ఇలాంటివి మాట్లాడటం సరికాదు'' అని సమాధానమిచ్చారు. నకిలీ ఐపీఎస్ అధికారి వ్యవహారంపై పవన్ స్పందిస్తూ.. ''నా పర్యటనలో నకిలీ ఐపీఎస్ ఎలా వచ్చాడనేది ఉన్నతాధికారులు చూసుకోవాలి. ఆ బాధ్యత ఇంటెలిజెన్స్, డీజీపీ, హోంమంత్రిదే. నాకు పనిచేయడం ఒక్కటే తెలుసు. ఈ అంశంపై నా పేషీ అధికారులు డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు'' అని పేర్కొన్నారు.
ముఠాలతో భయపెడితే మాది భయపడే ప్రభుత్వం కాదు !
السبت، 28 ديسمبر 2024
Andhra Pradesh తలుపులు మూసి ఎంపీడీవోపై దాడి చేయడం దారుణం నకిలీ ఐపీఎస్ ఎలా వచ్చాడనేది ఉన్నతాధికారులు చూసుకోవాలి ముఠాలతో భయపెడితే మాది భయపడే ప్రభుత్వం కాదు
ليست هناك تعليقات:
إرسال تعليق