ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి లోని రంగా కాలనీకి చెందిన రమాదేవి, రాజు పాలెం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన గోసుల వెంకటరావుకు 20 ఏళ్ల నుంచి వివాహేతర సంబంధం కొనసాగుతోంది. రమాదేవి భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోన్నారు. గోసుల వెంకటరావుకు కూడా వివాహం అయింది. ఆయనకు కూడా భార్య పిల్లలు ఉన్నారు. రమాదేవి సోదరి పక్షవాతంతో మంచం పట్టింది. ఈ క్రమంలో ఆమెకు రమాదేవి సహాయం చేస్తూ ఉంటుంది. ఇటీవలి రమాదేవి సోదరి మృతి చెందింది. సోదరి భర్తతో రమాదేవి చనువుగా ఉంటున్నట్లు స్థానికంగా ప్రచారం జరిగింది. దీంతో రమాదేవిపై ప్రియుడు గోసుల వెంకటరావు అనుమానం పెంచుకున్నాడు. సరిగ్గా ఈ సమయంలోనే తమ వివాహేతర సంబంధాన్ని ఇక ఆపేద్దామని, బ్యాంకులో పెట్టిన మూడు సవర్ల బంగారం విడిపించాలని వెంకటరావుపై రమాదేవి ఒత్తిడి తెచ్చింది. దీంతో రమాదేవిపై కక్షపెట్టుకుని, ఎలాగైనా రమాదేవిని అంతమోందించాలని అనుకున్నాడు. శనివారం రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో మాట్లాడుకుందామని రమాదేవికి వెంకటరావు చెప్పాడు. దీంతో రమాదేవి రెడ్డిగూడెం వచ్చింది. అక్కడ మద్యం తాగుతూ చాలా సేపు రమాదేవిని నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ రమాదేవి మాట వినలేదు. ఎంత బ్రతిమిలాడినప్పటికీ ఆమె ససేమీరా అంది. దీంతో తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని సత్తెనపల్లి మండలం గండ్లూరు సమీపంలోని పంట పొలాల్లోకి తీసుకొని వెళ్లాడు. అక్కడ రమాదేవి, వెంకటరావు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కోపోద్రిక్తుడైన వెంకటరావు, రమాదేవి చీర కొంగును ఆమె మెడకు బలంగా బిగించి హతమార్చాడు. ఆ తరువాత నిందితుడు వెంకటరావు అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానిక రైతులు మృతదేహాన్ని చూసి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సత్తెనపల్లి టౌన్ సీఐ బ్రహ్మయ్య, ఎస్ఐ సంధ్యారాణి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అయితే రాజుపాలెం పోలీస్‌స్టేషన్‌లో నిందితుడు గోసుల వెంకటరావు సోమవారం లొంగిపోయాడు. ఈ హత్య తానే చేశానని అంగీకరించాడు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ