టుడు మంచు మనోజ్‌పై దాడి కేసులో మోహన్‌బాబు మేనేజర్‌ కిరణ్‌, విజయ్‌ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజుల క్రితం తనపై దాడి చేశారని మనోజ్‌ పహడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం కిరణ్‌ను అరెస్ట్‌ చేశారు. మరో నిందితుడు వినయ్‌రెడ్డి కోసం గాలిస్తున్నారు. జల్‌పల్లిలో తనపై దాడి చేయడమే కాకుండా సీసీటీవీ ఫుటేజ్‌ను మాయం చేశారన్న మనోజ్‌ ఫిర్యాదు మేరకు మోహన్‌బాబు మేనేజర్‌ కిరణ్‌, విజయ్‌ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.

Post a Comment

Previous Post Next Post