ఆంధ్రప్రదేశ్ కి పవన్ కల్యాణ్ నాయకత్వం వహించాలని యంగ్ ఏపీని యంగ్ లీడర్ అయితేనే సమర్థవంతంగా లీడ్ చేయగలరన్నారు. వయస్సు, దేశవ్యాప్తంగా ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఏపీకి పవన్ కల్యాణ్ నాయకత్వం వహించాలని ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. 75 ఏళ్ల వయస్సులో సమర్థవంతంగా చంద్రబాబు పనిచేయలేరన్నారు. కాకినాడ పోర్టు విషయంలో విచారణ చేపట్టకుండానే లుక్ అవుట్ నోటీసులు ఇవ్వడంపై ఫిర్యాదు చేస్తానన్నారు. కాకినాడ పోర్టు వ్యవహారంపై 1997 నుంచి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అన్యాయం జరిగితే నాలుగున్నరేళ్ల నుంచి కేవీ రావు ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు రాగానే ఫిర్యాదు చేయడం వెనక ఆంతర్యం ఏమిటని నిలదీశారు. కేవీ రావు చంద్రబాబు మనిషని ఆక్షేపించారు. 2020 మేలో కేవీరావుకు ఫోన్ చేశానని, కాకినాడ పోర్టుపై విక్రాంత్‌తో మాట్లాడానని చెప్పేందుకు ఆధారాలున్నాయా అని విజయసాయి రెడ్డి అడిగారు.
ఆంధ్రప్రదేశ్ కి పవన్ కల్యాణ్ నాయకత్వం వహించాలి : విజయసాయి రెడ్డి ట్వీట్ !
الجمعة، 6 ديسمبر 2024
75 ఏళ్ల వయస్సులో చంద్రబాబు సమర్థవంతంగా పనిచేయలేరు Andhra Pradesh ఆంధ్రప్రదేశ్ కి పవన్ కల్యాణ్ నాయకత్వం వహించాలి విజయసాయి రెడ్డి ట్వీట్
ليست هناك تعليقات:
إرسال تعليق