డిసెంబర్ 9న రెడ్ మీ నోట్ 14 5జీ లాంచ్ అవుతుంది. ఇదే సిరీస్ నుంచి మరిన్ని ఫోన్ లను మరియు ఇయర్ బడ్స్ ను కూడా అదే రోజు లాంచ్ చేస్తున్నట్లు షియోమీ ప్రకటించింది. రెడ్ మీ నోట్ 14 5జి స్మార్ట్ ఫోన్ ను సన్నని మరియు ఆకర్షణీయమైన డిజైన్ తో తీసుకు వస్తోంది. ఈ ఫోన్ యొక్క టీజర్ పేజి ద్వారా అందించిన టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ డిజైన్ బయటపెట్టింది. ఈ ఫోన్ లో లో వెనుక పెద్ద స్క్వేర్ ఐలాండ్ లో పెద్ద రౌండెడ్ ట్రిపుల్ కెమెరా సిస్టంను అందించింది. ఈ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టంలో OIS సపోర్ట్ కలిగిన 50MP Sony LYT-600 సెన్సార్ ఉందని షియోమీ కన్ఫర్మ్ చేసింది. ఇందులో ఒక అల్ట్రా వైడ్ మరియు డెప్త్ సెన్సార్ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ తో షార్ప్ మరియు బ్లర్ ఫ్రీ ఫోటోలు పొందవచ్చని షియోమీ చెబుతోంది. రెడ్ మీ నోట్ 14 5జి MiAi పవర్ తో వస్తుంది. ఈ ఫోన్ లో AI ఫీచర్స్ ఉంటాయి మరియు ఇది మరింత స్మార్ట్ గా ఉండేలా చూస్తాయి. ఈ ఫోన్ లో చాలా ప్రకాశవంతమైన స్క్రీన్ ఉన్నట్లు కూడా షియోమీ చెబుతోంది. ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్ లలో టీజ్ అవుతోంది మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కలిగి ఉన్నట్లు కూడా అర్థం అవుతోంది.
డిసెంబర్ 9న రెడ్ మీ నోట్ 14 5జీ లాంచ్ !
الجمعة، 6 ديسمبر 2024
OIS సపోర్ట్ కలిగిన 50MP Sony LYT-600 సెన్సార్ science smart phone technology ఇయర్ బడ్స్ కూడా అదే రోజు లాంచ్ డిసెంబర్ 9న రెడ్ మీ నోట్ 14 5జీ లాంచ్
ليست هناك تعليقات:
إرسال تعليق