ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ లెర్నింగ్ సొల్యూషన్స్ అభివృద్ధి, తదుపరి స్థాయికి చేర్చడంలో అర్హత కలిగిన విద్యా సంస్థలు, పేద విద్యార్థులకు సహాయం చేయడానికి రాబోయే ఐదేళ్లలో వంద మిలియన్ డాలర్ల క్లౌడ్ క్రెడిట్స్‌ను అందజేయనున్నట్లు అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) వెల్లడించింది. ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేషన్ ఈక్విటీ ఇనిషియేటివ్ కింద గ్రహీతలకు నగదు వలె పనిచేసే క్లౌడ్ క్రెడిట్స్‌ను మంజూరు చేస్తారు. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సేవలను ఉపయోగించినప్పుడు సంస్థలు వారి ఖర్చులను తగ్గించుకోవడానికి ఇది వీలు కల్పిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ క్రెడిట్స్‌తో గ్రహీతలు ఏఐ అసిస్టెంట్స్, కోడింగ్ కరికులమ్స్, కనెక్టివిటీ టూల్స్, ఎడ్యుకేషనల్ ప్లాట్‌ఫామ్స్, మొబైల్ అప్లికేషన్స్, చాట్‌బాట్స్‌తోపాటు వివిధ సాంకేతిక ఆధారిత అభ్యాస అనుభవాల వంటి ఆవిష్కరణలను రూపొందించడానికి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ టెక్నాలజీ, అధునాతన ఏఐ సేవలను ఉపయోగించుకోవచ్చు.
విద్యార్థులకు ఐదేళ్లలో వంద మిలియన్ డాలర్ల క్లౌడ్ క్రెడిట్స్ అందజేయనున్న ఏడబ్ల్యూఎస్ !
الجمعة، 6 ديسمبر 2024
science technology అర్హత కలిగిన విద్యా సంస్థలు పేద విద్యార్థులకు విద్యార్థులకు ఐదేళ్లలో వంద మిలియన్ డాలర్ల క్లౌడ్ క్రెడిట్స్ అందజేయనున్న ఏడబ్ల్యూఎస్
ليست هناك تعليقات:
إرسال تعليق