దక్షిణ కొరియాలోని ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం జరిగిన దుర్ఘటనతో అక్కడి ప్రజలు విమాన ప్రయాణాలంటేనే జంకుతున్న పరిస్థితి నెలకొంది. నిన్నటి నుంచి అక్కడ రద్దవుతున్న బుకింగ్సే ఇందుకు నిదర్శనం. ఇప్పటివరకు దాదాపు 68వేల విమాన రిజర్వేషన్ బుకింగ్స్ రద్దయినట్లు జెజు ఎయిర్ వెల్లడించింది. వీటిలో 33వేలకు పైగా దేశీయ విమాన సర్వీసులకు సంబంధించిన బుకింగ్స్ కాగా.. 34వేలకు పైగా అంతర్జాతీయం బుకింగ్స్ ఉన్నాయని పేర్కొంది. టూర్ ప్యాకేజీల క్యాన్సిలేషన్స్ పెరుగుతున్నట్లు స్థానిక ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నట్లు అక్కడి పత్రికలు పేర్కొంటున్నాయి. ఆదివారం ఒక్కరోజే తమకు 40కి పైగా క్యాన్సిలేషన్‌కు సంబంధించిన ఎంక్వైరీలు వచ్చినట్లు ఓ ట్రావెలర్ తెలిపారు. బుకింగ్స్ దాదాపు 50శాతం మేర తగ్గినట్లు చెబుతున్నారు.
దక్షిణ కొరియా విమాన దుర్ఘటనతో 68వేల రిజర్వేషన్ బుకింగ్స్ రద్దు!
الاثنين، 30 ديسمبر 2024
international అక్కడి ప్రజలు విమాన ప్రయాణాలంటేనే జంకుతున్న పరిస్థితి దక్షిణ కొరియా విమాన దుర్ఘటనతో 68వేల రిజర్వేషన్ బుకింగ్స్ రద్దు
ليست هناك تعليقات:
إرسال تعليق