ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గుర్గావ్‌లో జాతీయ రహదారి 8పై వాణిజ్య ప్రకటనల బోర్డు ఏర్పాటు చేసేందుకు వెల్డింగ్‌ పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిప్పు రవ్వలు ఆ రోడ్డుపై వర్షంగా కురిశాయి. కదులుతున్న కార్లు, బస్సులు, బైక్‌లపై నిప్పురవ్వలు పడ్డాయి. ముందు జాగ్రత్త కోసం ఒక బస్సును డ్రైవర్‌ నిలిపివేశాడు. కాగా, ఒక డాక్టర్‌ ఈ వీడియో క్లిప్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 'గుర్గావ్‌లోని ఎన్‌హెచ్ 8పై దృశ్యాలు. ట్రాఫిక్ మళ్లింపు లేదా నియంత్రణ లేదు. అగ్నిమాపక భద్రతా జాగ్రత్తలు లేవు. వర్క్ జోన్ ఐసోలేషన్ లేదు. విపత్తుకు దారితీసే సరైన వేదిక' అని విమర్శించారు. మరోవైపు ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో అధికారుల నిర్లక్ష్యం, భద్రతా లోపాలపై నెటిజన్లు మండిపడ్డారు. ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు స్పందించారు. మరోసారి ఇలా జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఆ లేన్‌ మూసివేస్తామని పేర్కొన్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ