అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణను నాంపల్లి కోర్టు జనవరి 3కు వాయిదా వేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ డిసెంబర్ 24న ఆయన నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ ను కొట్టివేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడానికి అల్లు అర్జున్ కారణమని ఆయన వాదించారు. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ ను డిసెంబర్ 13న చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజున హైకోర్టు ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది. ఈ సూచన మేరకు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేశారు.
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణ 3కు వాయిదా !
الاثنين، 30 ديسمبر 2024
Andhra Pradesh cinema telangana అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణ 3కు వాయిదా డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసు
ليست هناك تعليقات:
إرسال تعليق