కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని న్యూ ఇయర్ వెల్‌కమ్ ఆఫర్ ప్లాన్ 2025ని కస్టమర్లకు జియో అందుబాటులోకి తెచ్చింది. 200 రోజుల వ్యాలిడిటీతో రూ.2 వేలకుపైగా అదనపు ప్రయోజనాలు కల్పిస్తూ ఈ ప్లాన్ తెచ్చినట్లు ప్రకటించింది. ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకునేందుకు రూ.2025తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా లాంగ్ టర్మ్ వ్యాలిడిటీతో పాటుగా రూ. 2,150 విలువైన కూపన్ ప్రయోజనాలనూ ఇస్తోంది. రిలయన్స్ జియో న్యూ ఇయర్ వెల్‌కమ్ ఆఫర్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.2025తో రీఛార్జ్ చేసుకుంటే 200 రోజుల వ్యాలిటిడీ లభిస్తుంది. దీని ద్వారా అపరిమిత 5జీ డేటా అందిస్తుండడం గమనార్హం. రోజుకు 2.5 జీబీ చొప్పున మొత్తం 500 జీబీ డేటా లభిస్తుంది. డేటాతో పాటుగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు వస్తాయి. ఇవే ప్రయోజనాలతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నెలవారీ ప్లాన్లతో పోలిస్తే దాదాపు రూ. 468 ఆదా చేసుకోవచ్చని రిలయన్స్ జియో తెలిపింది. ప్రస్తుతం రూ. 349 ప్లాన్ ద్వారా ఇవే ప్రయోజనాలు ఉన్నాయి. 200 రోజులకు ఈ విలువ రూ. 2,493 అవుతుందని, న్యూ ఇయర్ వెల్‌కమ్ ఆఫర్ ద్వారా రూ.2025కే అందిస్తున్నట్లు తెలిపింది.
200 రోజుల వ్యాలిడిటీతో జియో న్యూఇయర్ ప్లాన్ !
الجمعة، 27 ديسمبر 2024
200 రోజుల వ్యాలిడిటీతో జియో న్యూఇయర్ ప్లాన్ science technology రూ.2 వేలకుపైగా అదనపు ప్రయోజనాలు లాంగ్ టర్మ్ వ్యాలిడిటీ
ليست هناك تعليقات:
إرسال تعليق