ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులతో సీఆర్‌డీఏ, ప్రపంచబ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాజధానిలో చేపట్టే ప్రాజెక్టులపై రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. రైతుల సందేహాల్లో సగం నివృత్తి చేసినట్లు సీఆర్‌డీఏ కమిషనర్ భాస్కర్ తెలిపారు. సమావేశం అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ''అమరావతికి రుణాలు ఇచ్చే సమయంలోనే ఇళ్లు కట్టాలని పలువురు కోరారు. బయట నుంచి వచ్చే వారికీ ఇళ్లు మంజూరు చేస్తాం. పది మిలియన్ డాలర్ల పెట్టుబడి వస్తే మిలియన్ డాలర్ల రాయితీ ఇస్తారు. మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తాం.. ఇవన్నీ ఒప్పందంలో భాగమే. రైతులు చెప్పిన 90 శాతం అంశాలు ఒప్పందంలో ఉన్నావే. కోర్టు కేసులపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఈ ఒప్పందాలు పూర్తయితే ఇంకా రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తారు. దాదాపు రూ.30 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అవకాశం ఉంది. ఈ నెల 11న రుణాల మంజూరుపై సంతకాలు చేస్తారు. రుణాలు వచ్చిన వెంటనే అమరావతి నిర్మాణం ప్రారంభిస్తాం'' అని కమిషనర్ వెల్లడించారు. అమరావతి నిర్మాణంలో భాగం అవుతున్నందుకు సంతోషంగా ఉందని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి అన్నారు. ఇది ప్రజా రాజధాని అని.. వారి భాగస్వామ్యం అవసరం అని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులోనూ ప్రపంచ బ్యాంకు సహకారం ఉంటుందన్నారు.
అమరావతి రైతులతో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల భేటీ !
السبت، 2 نوفمبر 2024
Andhra Pradesh అమరావతి రైతులతో ప్రపంచ బ్యాంకు ఏడీబీ ప్రతినిధుల భేటీ రైతుల సందేహాల్లో సగం నివృత్తి సీఆర్‌డీఏ కమిషనర్ భాస్కర్
ليست هناك تعليقات:
إرسال تعليق