ఆంధ్రప్రదేశ్ లో టెట్ ఫలితాలు వాయిదా పడ్డాయి. ఏపీ విద్యాశాఖ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నేడు టెట్ ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. ఈ ఫలితాలను నవంబర్ 4వ తేదీన ప్రకటించేందుకు రాష్ట్ర విద్యాశాఖ సిద్ధమైంది. మరోవైపు నవంబర్ 6న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ కానున్నట్లు సమాచారం. తుదీ కీ విడుదలలో జాప్యం జరగటంతో టెట్ ఫలితాల తేదీని మార్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో టెట్ పరీక్షలు అక్టోబర్ 3వ తేదినుండి అక్టోబర్ 21వ తేదివరకు జరిగాయి. మొత్తం 17 రోజల పాటు ఈ పరీక్షలను నిర్వహించారు. ప్రతి రోజు 2 షిప్టులుగా పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్షలకు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 3,68,661 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. వీరంతా కూడా టెట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
Post a Comment