తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి ఇజ్రాయెల్ ముందుకు రావడం పట్ల ఆ దేశ రాయబారి రువెన్ అజర్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ కృతజ్ఞతలు తెలిపారు. రెండు దేశాల మధ్య పరస్పర సహకారానికి ఇజ్రాయెల్ ఆసక్తి కనబర్చడం సంతోషంగా ఉందన్నారు. కృత్రిమ మేథ, సైబర్ సెక్యూరిటీలో ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని, ఆ రంగాల్లో తెలంగాణకు సహకరించాలని ఈ సందర్భంగా శ్రీధర్ బాబు కోరారు. రక్షణ రంగం, వ్యవసాయం, నీటి వినియోగంలో ఆధునిక సాంకేతికత, నూతన పరిశోధనలు, పారిశ్రామిక అభివృద్ధిలో తోడ్పాటును అందించాలని మంత్రి చేసిన అభ్యర్థనకు రువెన్ అజర్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో 200 ఎకరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిటీని ఏర్పాటు చేస్తున్న విషయాన్ని శ్రీధర్ బాబు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీపై అత్యాధునిక శిక్షణలో మద్దతు కావాలని కోరారు. వ్యర్థ జలాల పునర్వినియోగ సాంకేతికతలో తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని.. ఇజ్రాయెల్ నుంచి పరిశ్రమలు పెట్టేందుకు ఏ సంస్థ ముందుకొచ్చినా నైపుణ్యం కలిగిన మానవ వనరులు సిద్ధంగా ఉన్నాయన్నారు. నూతన పరిజ్ఞానం, పరిశ్రమల ఏర్పాటులో సాయపడితే తెలంగాణ నుంచే ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చని మంత్రి సూచించారు.
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానం !
الجمعة، 29 نوفمبر 2024
telangana ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజర్‌కు కృతజ్ఞతలు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానం
ليست هناك تعليقات:
إرسال تعليق