తెలంగాణలోని నల్గొండ జిల్లా మునుగోడు పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురుకుల సిబ్బందిపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మెస్ చార్జీలు పెంచినప్పటికీ భోజనంలో నాణ్యత లేదంటూ ఏజెన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మెరుగైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. అన్నం, కూరలు, సాంబారు పెరుగు నాసిరకంగా ఉన్నాయంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అన్నం మాడిపోవడంతో వంట మనిషిపై వంట ఏజెన్సీ నిర్వాహకులపై నిప్పులు చెరిగారు.
గురుకుల సిబ్బందిపై రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం !
الجمعة، 29 نوفمبر 2024
telangana గురుకుల సిబ్బందిపై రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మెస్ చార్జీలు పెంచినప్పటికీ భోజనంలో నాణ్యత లేదు
ليست هناك تعليقات:
إرسال تعليق