హైదరాబాద్ లోని వెంగళరావు నగర్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో ఫుడ్ సేఫ్టీ విభాగం నిర్వహించిన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫుడ్ సేఫ్టీ విభాగం కమిషనర్ ఆర్‌వి కర్ణన్, ఐపీఎం డైరెక్టర్ శివలీల, జీహెచ్ఎంసీ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొంత మంది స్ట్రీట్ ఫుడ్ వెండర్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫుడ్ సేఫ్టీ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. వ్యాపారం చేసుకునే వారికి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. వసతి గృహాల్లో పిల్లలకు మంచి భోజనం పెట్టకుండా ఇబ్బంది పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పెరిగిన హోటళ్ల సంఖ్య, జనాభాకు అనుగుణంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల సంఖ్యను పెంచనున్నట్టు మంత్రి ప్రకటించారు.
ఫుడ్ సేఫ్టీ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి !
الثلاثاء، 5 نوفمبر 2024
telangana ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో ఫుడ్ సేఫ్టీ విభాగం ఫుడ్ సేఫ్టీ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
ليست هناك تعليقات:
إرسال تعليق