హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో తెలంగాణ రియల్టర్స్ ఫోరమ్ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగిస్తూ తెలంగాణలో భూముల విలువ ఛూమంతర్ అనగానే పెరగలేదని, కేసీఆర్ సమగ్ర, సమీకృత, సమ్మిళిత అభివృద్ధి చేశారని, అందుకే తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా ఎకరం రూ. 15 నుంచి 20 లక్షలకు తక్కువ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మార్పు.. మార్పు అని కాంగ్రెస్ ప్రచారం చెప్పింది.. మరి ఈ మార్పు ఎలా ఉంది? టీఆర్ఎఫ్ మాదిరిగానే టీఆర్ఎస్ పెట్టే వరకు కూడా తెలంగాణ శక్తి ఎవరికీ తెలియలేదు అని కేటీఆర్ తెలిపారు. భూమి కోసం తెలంగాణలో జరిగిన పోరాటాలు ఇక్కడి బిడ్డలందరికీ తెలుసు. ఎన్నో భూ ఉద్యమాలకు తెలంగాణ కేంద్రంగా ఉంది. ప్రతి ఒక్కరి జీవితం భూమి చుట్టూ తిరుగుతోంది. భూమి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది కనుకే దాని కోసం ఎన్నో పంచాయితీలు జరుగుతాయి. టీఆర్ఎస్ పార్టీకి మొదట్లో రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతంలో పట్టు దొరకలేదు. ఎందుకంటే తెలంగాణ ఏర్పడితే భూముల ధరలు తగ్గుతాయని చాలా ప్రచారం చేశారు. తెలంగాణ ఏర్పడితే భూముల విలువ పెరుగుతదంటే ఎవరు నమ్మలేదు. అసలు రాష్ట్రాన్ని నడిపే సమర్థత మీకు ఉందా అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. హిందూ – ముస్లిం పంచాయితీ, నక్సలిజం, భూముల ధరలు పడిపోతాయంటూ ప్రచారాలు చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ తెలంగాణ ఏర్పడిన వెంటనే కేసీఆర్ పొట్టకూటి కోసం వచ్చిన వాళ్లతో మాకు పంచాయితీ లేదన్నారు. అభివృద్ధే మా మతం, సంక్షేమమే మా కులం అంటూ కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. గతంలో బంగారం బ్యాంకుల్లో డిపాజిట్ చేసేవారు. కానీ గత 20 ఏళ్లుగా మాత్రం మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వాళ్లు భూమి మీద పెట్టుబడి పెట్టారు. అలాంటిది తెలంగాణ ఏర్పడితే తెలంగాణలో భూముల ధరలు ఢమాల్ అంటాయంటూ అనుమానంతో వాళ్లు ఉండేవారు. అందుకే తెలంగాణ ఏర్పాటుకు వాళ్లు భయపడ్డారని కేటీఆర్ తెలిపారు. అదే విధంగా తెలంగాణలో భూములకు గతంలో నీళ్లు ఉండే పరిస్థితి లేదు. మా తాతకు కూడా వందల ఎకరాలు ఉండేది. కానీ నీళ్లు లేకపోవటంతో దానికి ఎలాంటి విలువ లేకుండా పోయింది. ఎంత పెద్ద భూస్వామి అయినప్పటికీ భూమికి విలువ లేకపోవటంతో బంగారం కుదవ పెట్టాల్సిన పరిస్థితి ఉండేది. కేసీఆర్ ఇవన్నీ దగ్గరుండి గమనించారు. నీళ్లు లేకపోవటంతోనే భూములకు విలువ లేదని గ్రహించారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలన తర్వాత ఇప్పుడు తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లిన సరే ఎకరానికి రూ. 15 లక్షలు అయ్యింది. భూమి విలువ పెరిగితే భూమి ఉన్న యజమానికి ఎంతో భరోసా ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. రైతు భరోసా వచ్చి, సాగు నీళ్లు వచ్చి, 24 గంటల కరెంట్ వచ్చి ఇవాళ ప్రతి రైతు ఎంతో భరోసాగా ఉన్నాడు. దానికి కారణం కేసీఆరే. మార్పు మార్పు అని కాంగ్రెస్ ప్రచారం చేసింది. మరి ఈ మార్పు ఎలా ఉంది? తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌ను మీరు నాశనం చేస్తారంట కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. తెలంగాణ రాకముందు వారానికి రెండు రోజులు పవర్ హాలిడేస్ ఉండేవి. రైతులు అర్థరాత్రి వెళ్లి పొలానికి నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ కేసీఆర్ మొత్తం పరిస్థితిని మార్చేశారు. నీళ్లు, కరెంట్ సమస్యను తీర్చేశారు. తెలంగాణలో భూముల విలువ ఛూమంతర్ అనగానే పెరగలేదు. సమగ్ర, సమీకృత అభివృద్ధిని కేసీఆర్ చేశారు. అందుకే తెలంగాణలో ఎక్కడ చూసినా ఒక్క ఎకరం రూ. 15 లక్షలు ఉందని కేటీఆర్ తెలిపారు. మా ప్రత్యర్థులు మాత్రం డెవలప్‌మెంట్‌ ఆటో పైలట్ మోడ్‌లో ఉందని అంటారు. మరీ ఈ ఏడాది ఎందుకు డెవలప్‌మెంట్ జరగటం లేదు. మంచిగా చేసిన కరెంట్‌ను కూడా నాశనం చేశారు. ఏ రైతును కదలించినా బాధపడుతున్నారు. మేము కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయామని చెబుతున్నారు. నల్గొండలో జరిగిన కాంగ్రెస్ మీటింగ్‌లో వాళ్ల పార్టీ నాయకులే కాంగ్రెస్ చేసిన మోసాలను చెబుతున్నారని కేటీఆర్ అన్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ