Ad Code

జాతీయ రహదారిపై అఘోరీ హల్ చల్ !


గుంటూరు - విజయవాడ రహదారిపై మంగళగిరి వద్ద జనసేన పార్టీ కార్యాలయం దగ్గరలో అఘోరీ హల్చల్ చేసింది.  తను పవన్ కళ్యాణ్ ను కలవాలని, ఆయనను కలిసిన తర్వాతనే ఇక్కడ నుండి వెళతానంటూ రోడ్డుపై బైఠాయించింది. ఆలయ భూములు పరిరక్షించాలని పవన్ కళ్యాణ్ ను కోరతానని చెప్పింది. పవన్ కళ్యాణ్ రావాలి అంటూ నినాదాలు చేసింది. అఘోరీ నిరసనతో గుంటూరు విజయవాడ మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో వీడియో తీస్తున్న ఓ రిపోర్టర్ పై కర్రతో దాడి చేసి అతడిని గాయపరిచింది. అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించిన పోలీసుల పైనా దాడికి యత్నించింది. అఘోరీ తీరుపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించడం వల్ల ఎంతో మందికి ఇబ్బంది అవుతోందని, కావాలంటే జనసేన కార్యాలయం ముందు ధర్నా చేసుకోవాలని చెబుతున్నారు. ఇదిలా ఉంటే అఘోరీ ప్రతిరోజు ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తోంది. తన కారులో తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. ఇటీవల ఏపీలోని ఓ ఆలయం వద్ద ఆత్మహత్యకు యత్నించింది.

Post a Comment

0 Comments

Close Menu