శ్రీలంక ప్రధాన మంత్రిగా మరోసారి హరిణి అమరసూర్యని అధ్యక్షుడు దిసనాయకే నియమించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 225 మంది సభ్యులకు గాను అధ్యక్షుడు దిసనాయకే నేతృత్వంలోని వామపక్ష కూటమి 159 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొత్త మంత్రి వర్గాన్ని సోమవారం నియమించారు. పీఎంగా హరిణికి అవకాశం ఇవ్వగా..విదేశాంగ మంత్రిగా సీనియర్ నేత విజితా హెరాత్‌ను తిరిగి నియమించారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖకు జేవీపీ నేత కేడీ లలకంట ఇన్‌చార్జిగా వ్యవహరించనున్నారు. రక్షణ, ఆర్థిక శాఖ వంటి కీలక పోర్ట్ ఫోలియోలు దిసనాయకే వద్దే ఉంచుకున్నట్టు తెలుస్తోంది.
0 Comments