దేశంలో ఐ-ఫోన్ అసెంబ్లింగ్ వర్కర్ల నియామక ప్రక్రియ చేపడుతున్న ఏజెన్సీ సంస్థలకు ఫాక్స్‌కాన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆపిల్ ఐ-ఫోన్ల అసెంబ్లింగ్ కోసం ఉద్యోగ నియామకాలకు జారీ చేసే వాణిజ్య ప్రకటనల్లో వయస్సు, లింగం, వైవాహిక స్థితి గురించి పేర్కొనరాదని స్పష్టం చేసింది. వివాహిత మహిళలకు అదనపు బాధ్యతలు ఉన్నాయన్న పేరుతో వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఫాక్స్‌కాన్ నిరాకరిస్తున్నదని గతంలో వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన కేంద్రం విచారించి తమకు నివేదిక అందజేయాలని రీజనల్ చీఫ్ లేబర్ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది మే వరకూ తమకు ఉద్యోగుల నియామక బాధ్యతలు నిర్వర్తించించిన భారత్ ఏజెన్సీలను వాణిజ్య ప్రకటనల్లో తమ పేర్లు వాడొద్దని, ప్రామాణికంగా విధి విధానాల్లో మార్పు చేయాలని ఫాక్స్ కాన్ ఆదేశించినట్లు సమాచారం. అలాగే నియామక సంస్థలు మీడియాతో మాట్లాడవద్దని, అలా మాట్లాడితే వారి కాంట్రాక్టులు రద్దు చేస్తామని ఫాక్స్ కాన్ హెచ్చరించినట్లు తెలుస్తున్నది. అంతే కాదు నియామక వాణిజ్య ప్రకటనల్లో ఫాక్స్ కాన్ పేరు వాడొద్దని పేర్కొన్నట్లు సమాచారం.
0 Comments