ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వైఎస్ విజయమ్మ మరో బహిరంగ లేఖ రాశారు. కొన్నాళ్ల క్రితం కర్నూలు లో జరిగిన కారు ప్రమాదం విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాన్ని ఆమె తన లేఖలో ఖండించారు. అసత్య ప్రచారాలతో తనకు మానసిక వేదన కలుగుతుందన్నారు. వాటిని ఖండించకపోతే ప్రజలు నిజమనుకునే ప్రమాదముందన్నారు. ప్రజలకు నిజం తెలియాలని కొంత మంది దుర్మార్గపు ఉద్దేశాలను ప్రజలకు తెలియజేయాలనే మరో బహిరంగ లేఖ రాస్తున్నట్టు తెలిపారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం తీవ్రంగా కలిచి వేస్తోంది. గతంలో ఎప్పుడో జరిగిన నా కారు ప్రమాదాన్ని నా కుమారుడి పై పెట్టి దుష్ప్రచారం చేయడం అత్యంత జుగుస్సాకరం. రాజకీయంగా లబ్ది పొందాలనే ప్రయత్నం అత్యంత దుర్మార్గం. అమెరికాలో ఉన్న నా మనవడి దగ్గరకు వెళ్తే దాన్ని కూడా తప్పుగా చిత్రీకరించి, బయపడి నేను విదేశాలకు వెళ్లిపోయినట్టు దుష్ప్రచారం చేయడం నీతిమాలిన చర్య అన్నారు. రాజకీయాల కోసం ఇంతగా దిగజారి ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో వారికి ప్రజలే బుద్ది చెబుతారని విజయమ్మ లేఖలో పేర్కొన్నారు.
అసత్య ప్రచారాలతో మానసిక వేదన కలుగుతుంది !
الاثنين، 4 نوفمبر 2024
Andhra Pradesh అసత్య ప్రచారాలతో మానసిక వేదన కలుగుతుంది రాష్ట్ర ప్రజలకు వైఎస్ విజయమ్మ మరో బహిరంగ లేఖ వాటిని ఖండించకపోతే ప్రజలు నిజమనుకునే ప్రమాదముంది
ليست هناك تعليقات:
إرسال تعليق