ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వైరల్ వీడియో షేర్ చేయబడింది. వీడియోలో ఒక వ్యక్తి పురాతన వస్తువును తవ్వితీస్తున్నాడు. ఓ వ్యక్తి గడ్డపారతో భూమిని తవ్వడంతో వీడియో ప్రారంభమవుతుంది. అతను తవ్వడం పూర్తి చేస్తున్నప్పుడు అక్కడ ఒక పెద్ద పురాతన కుండ కనిపించింది. మట్టితో కప్పబడి ఉన్న ఆ కుండ నోటిపై తుప్పు పట్టిన మెటల్ ప్లేట్ ఏర్పాటు చేసి ఉంది. అది ఓపెన్ చేసి చూడా వారికి ఊహించని సీన్ ఎదురైంది. తవ్వకాల్లో బయటపడ్డ పాత కుండను వారు బయటకు తీసి ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. తుప్పు పట్టి ఉన్న ఆ కుండ మూతను తెరిచి చూడగానే లోపల కనిపించిన దృశ్యం వారి మతి పోగొట్టేలా చేసింది. ఆ కుండలో పాములు, కప్పలు నిండివున్నాయి. అవన్నీ ఆ కుండలోని నిధిని రక్షిస్తున్నట్టుగా ఉన్నాయి. ఎలాగోలా వాటిని తీసి పక్కకు విసిరేశారు. అప్పుడు ఆ కుండ లోపల వారికి కళ్లు బైర్లు కమ్మే నిధి కనిపించింది. బంగారు హారం, పాత వస్త్రం ఒకటి కనిపించింది. దానిని బయటకు తీయగా, లోపల చాలా చిన్న చిన్న బంగారు నాణేలు కనిపించాయి. మొత్తం ఆ కుండలో వందల కొద్దీ నాణేలు బయటపడ్డాయి. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
తవ్వకాల్లో బయటపడ్డ పురాతన కుండలో నిధి : ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో వైరల్ !
الاثنين، 4 نوفمبر 2024
ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో వైరల్ కప్పలు కుండలో పాములు తవ్వకాల్లో బయటపడ్డ పురాతన కుండలో నిధి బంగారు హారం వందల కొద్దీ బంగారు నాణేలు
ليست هناك تعليقات:
إرسال تعليق