కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈరోజు చిరంజీవి ఇంటికి వెళ్లి కలిశారు. ఈ సంధర్భంగా కిషన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దాతృత్వం, చలనచిత్ర పరిశ్రమకు చేసిన కృషి ద్వారా చాలా మందికి స్ఫూర్తినిచ్చిన మెగాస్టార్ లాంటి మంచి వ్యక్తిని కలవడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఫొటోలు షేర్ చేశారు. ఇక తాజాగా ఏఎన్నార్ జాతీయ అవార్డును నటుడు చిరంజీవి అందుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన అక్కినేని జాతీయ పురస్కార వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా చిరంజీవికి పురస్కారాన్ని ప్రదానం చేశారు.
చిరంజీవి ఇంటికెళ్లి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి !
Telugu Lo Computer
0
Comments
Post a Comment