ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2014-15 నుండి 2018-19 సంవత్సరాల మధ్య పూర్తి అయిన పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి పనుల బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 1982 లో వచ్చిన “ఏపీ లాండ్ గ్రాబింగ్ ఆక్ట్” స్థానంలో 2024 లో కొత్త ముసాయిదా బిల్‌ను ప్రవేశపెట్టడం కేబినెట్ ఆమోదించింది. జ్యుడీషియల్ ఆఫీసర్ల రిటైర్మెంట్ వయసును 60 నుండి 61 సంవత్సరాలకు పెంచేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ సవరణ 2024 నవంబర్ 1 నుండి అమలులోకి రానుంది. ఏపీ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ సవరణ బిల్ 2024 సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ సవరణ ఆర్డినెన్స్ 2024 కు కూడా ఆమోదం ఇచ్చారు. కుప్పం , పిఠాపురం ప్రాంతాలలో ఏరియా డెవలప్ మెంట్ అథారిటీలను ఏర్పాటుచేసేందుకు కేబినెట్ ఆమోదించింది. కుప్పం డెవలప్ మెంట్ అథారిటీ నాలుగు మండలాలను, ఒక మున్సిపాలిటీని కవర్ చేస్తూ స్థాపించబడింది. సత్తెనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1069.55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, పల్నాడు జిల్లా 92 గ్రామాలు, బాపట్ల జిల్లా 62 గ్రామాలను తిరిగి సీఆర్డీఏ పరిధిలోకి చేర్చేలా కేబినెట్ నిర్ణయించింది. 2024-25 విద్యా సంవత్సరంలో నుండి పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్‌ను విద్యార్థుల కళాశాల బ్యాంక్ అకౌంట్ లో నేరుగా జమ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీని ద్వారా విద్యార్థులకు సర్టిఫికెట్లు త్వరగా జారీ చేయడం సాధ్యం అవుతుంది. 2024 జూన్ 24 నుండి అక్టోబర్ 23 వరకు తీసుకున్న మంత్రివర్గ నిర్ణయాలపై యాక్సన్ టేకెన్ రిపోర్టులపై కూడా చర్చ జరిగింది.


Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ