టాటా నానో ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ అవుతోంది. రతన్ టాటా కలల కారుగా వస్తున్న టాటా నానో ఈవీ వాహన రంగంలో సరికొత్త ఒరవడిని తీసుకొస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. సిటీ డ్రైవింగ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఈ కారును డిజైన్ చేశారు. తక్కువ ధరతో స్టైల్, కంఫర్ట్ విషయంలో కాంప్రమైస్ కాకుండా కారును టాటా తీసుకొస్తోంది. టాటా నానో ఈవీ 17kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఒక్కసారి ఫుల్‌ఛార్జ్ చేస్తే 312 కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేయొచ్చని సమాచారం. గరిష్ఠంగా గంటకు 80 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్లగలదని తెలుస్తోంది. మోడర్న్ ఎలక్ట్రిక్ టెక్నాలజీతో వస్తున్న ఈ వెహికల్ 10 సెకండ్లలోనే గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఫుల్ ఛార్జింగ్ కావడానికి 6 నుంచి 8 గంటల సమయం తీసుకుంటుంది. ఇంటీరియర్ స్పేస్ కూడా కాస్త ఎక్కువగానే రానుంది. నలుగురు సౌకర్యంగా కూర్చునేలా ఇంటీరియర్ డిజైన్ రానున్నట్లు సమాచారం. మీడియా రిపోర్ట్స్ ప్రకారం టాటా నానో ఈవీ ఒక కాంపాక్ట్ కారు. అద్భుతమైన డిజైన్‌తో వస్తున్న ఈ కారు పొడవు 3,164mm, వెడల్పు 1,750mm, వీల్ బేస్ 2,230mm, గ్రౌండ్ క్లియరెన్స్ 180mmగా ఉంది. దీంతోపాటు, 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్లూటూత్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, పవర్‌ఫుల్ 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో కూడిన యాంటీ-లాక్ బ్రేక్ సిస్టమ్ వంటి ఫీచర్లన్నీ ఇందులో ఉంటాయి. ఏసీ, పవర్ స్టీరింగ్, డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, రియర్ పార్కింగ్ సెన్సర్లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టం లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. టాటా నానో ఈవీ బేస్ వేరియంట్ ధర రూ.2.5 లక్షలతో ప్రారంభం కానున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక హైఎండ్ ఫీచర్స్‌తో కూడిన టాప్ వేరియంట్ ధర రూ.8 లక్షల వరకు ఉండొచ్చని సమాచారం.
దేశీయ మార్కెట్లోకి టాటా నానో ఎలక్ట్రిక్ కారు ?
الأربعاء، 6 نوفمبر 2024
17kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది electric car national science tata technology దేశీయ మార్కెట్లోకి టాటా నానో ఎలక్ట్రిక్ కారు ? రతన్ టాటా కలల కారు
ليست هناك تعليقات:
إرسال تعليق