ఆంధ్రప్రదేశ్ లో ఏడు కీలక బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు-2024, ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు-2024, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లు-2024, ఎంతమంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించేలా నిబంధనలు మారుస్తూ తీసుకొచ్చిన బిల్లు సభ ఆమోదం పొందింది. అలాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సవరణ బిల్లు-2024, ఆయుర్వేదిక్ హోమియోపతి మెడికల్ ప్రాక్టిషనర్స్ చట్ట సవరణ, ఏపీ మెడికల్ ప్రాక్టిషనర్స్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ బిల్లు-2024 బిల్లులకు కూడా శాసనసభ ఆమోదం తెలిపింది. వీటితో పాటు ఏపీ సహకార సంఘం సవరణ బిల్లు-2024ను కూడా శాసనసభ ఆమోదించింది.
ఆంధ్రప్రదేశ్ లో ఏడు బిల్లులకు శాసనసభ ఆమోదం !
الاثنين، 18 نوفمبر 2024
Andhra Pradesh ఆంధ్రప్రదేశ్ లో ఏడు బిల్లులకు శాసనసభ ఆమోదం ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు-2024 ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లు-2024 పంచాయతీరాజ్ సవరణ బిల్లు-2024
ليست هناك تعليقات:
إرسال تعليق