అంతర్జాతీయ పరిస్థితులకు తోడు పెండ్లిండ్ల సీజన్ ప్రారంభం కావడంతో దేశీయ బులియన్ మార్కెట్లో బంగారానికి గిరాకీ ఎక్కువైంది. ఫలితంగా బంగారం, వెండి ధరలు పుంజుకుంటున్నాయి. వరుసగా నాలుగు రోజుల పతనాన్ని బ్రేక్ చేస్తూ సోమవారం దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 10 గ్రాముల బంగారం (24 క్యారట్స్) రూ.400 వృద్ధి చెంది రూ.77,450లకు చేరుకున్నది. గురువారం రూ.77,050 పలికింది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,810 వృద్ధి చెంది రూ.92 వేల మార్కు దాటింది. గురువారం కిలో వెండి ధర రూ.90,190 వద్ద స్థిర పడింది. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో గోల్డ్ కాంట్రాక్ట్స్ డిసెంబర్ డెలివరీ గోల్డ్ కాంట్రాక్ట్స్ తులం బంగారం ధర రూ.621 వృద్ధి చెంది రూ.74,567 పలికింది. కిలో వెండి డిసెంబర్ డెలివరీ ధర రూ.879 పుంజుకుని రూ.89,300లకు చేరుకున్నది.
ホーム
/
వెండి ధరలు
/
పెరిగిన బంగారం, వెండి ధరలు !
الاثنين، 18 نوفمبر 2024
bulion market business national అంతర్జాతీయ పరిస్థితులకు తోడు పెండ్లిండ్ల సీజన్ ప్రారంభం పెరిగిన బంగారం వెండి ధరలు
ليست هناك تعليقات:
إرسال تعليق