కర్ణాటకలో రేణుకాస్వామి హత్యకేసులో ఏ-2 నిందితుగా ఉంటూ బళ్లారి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కన్నడ హీరో దర్శన్ బెయిల్‌పై విడుదలయ్యారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని ఆయన తరపు న్యాయవాదులు వేసిన పిటిషన్‌పై షరతులతో కూడిన బెయిల్‌ను న్యాయాధికారి మంజూరు చేశారు. ఆగస్టు నెల 29న బళ్లారి జైలుకు దర్శన్‌ను తీసుకొచ్చారు. సుమారు 60 రోజుల పాటు బళ్లారి జైల్లో దర్శన్ నిందితుడగా హై సెక్యూరిటీ సెల్‌లో ఉన్నారు. ఆయన కోసం ఆయన భార్య, తల్లి , సోదరులు, బావ మరిది అనేక సార్లు వచ్చారు. దర్శన్ విడుదల సందర్భంగా ఆయన భార్య జైలు వద్దకు వచ్చారు. జైలు నుంచి బయటకు రాగానే భార్యను కౌగిలించుకుని దర్శన్ భావోధ్వేగానికి గురై కన్నీరు మున్నీరయ్యారు.
కన్నడ హీరో దర్శన్ బెయిల్‌పై విడుదల !
الخميس، 31 أكتوبر 2024
60 రోజుల పాటు బళ్లారి జైల్లో cinema karnataka అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని కన్నడ హీరో దర్శన్ బెయిల్‌పై విడుదల షరతులతో కూడిన బెయిల్
ليست هناك تعليقات:
إرسال تعليق