నవంబర్ 1వ తేదీన శుక్రవారం ఉదయం 9 గంటలకు ముత్యాలమ్మ ఆలయం దగ్గర లోక కల్యాణంకోసం ఆత్మార్పణ చేసుకుంటానని మహిళా అఘోరీ నాగసాధువు ప్రకటన చేసింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. తాజాగా ఆమెను సొంత గ్రామమైన మంచిర్యాల జిల్లా నన్నెల మండలం కుశ్నపల్లికి భారీ భద్రత మధ్య పోలీసులు తరలించారు. అనంతరం అఘోరీని తల్లిదండ్రులకు అప్పగించారు. అంతేకాక కుశ్నపల్లి గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు. గ్రామంలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి.
إرسال تعليق