ఎలాన్ మస్క్ కు సంబంధించిన ఏఐ కంపెనీ ఎక్స్ఏఐ హిందీ ట్యూటర్ల కోసం వెతుకుతోంది. అర్హులైన వారిని తమ కంపెనీలో ఏఐ ట్యూటర్లుగా నియమించుకోనుంది. ఈ ఉద్యోగం కోసం కార్యాలయానికి వెళ్లాల్సిన పనిలేదు. ఇంటి నుంచే వర్క్ చేయొచ్చు. సెలెక్ట్ అయిన వారికి కంపెనీ ప్రతి గంటకు రూ. 2,900 నుంచి రూ. 5,500 వరకు వేతనం అందజేస్తుంది. హిందీ భాషపై పట్టుఉన్నవారు ఇంగ్లీష్ వచ్చిన వారు ఈ జాబ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.లింక్డ్ ఇన్ లో ఇచ్చిన ఉద్యోగ వివరణ ప్రకారం ఈ ఉద్యోగానికి ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేదు. హిందీపై మంచి పట్టు, పరిశోధన నైపుణ్యాలు, హిందీలో జర్నలిజం లేదా కంటెంట్ రైటింగ్ లో అనుభవం ఉండాలి. టెక్నికల్ పదాలను ఇంగ్లీష్ నుంచి హిందీలోకి అనువదించే నైపుణ్యం ఉండాలి. హిందీతోపాటు ఇంగ్లీష్, చైనీస్, రష్యన్, స్పానిష్ మాట్లాడే వారికి కూడా కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఉద్యోగంలో చేరిన వారు ఏం చేయాలనే విషయంపైనా కంపెనీ క్లారిటీ ఇచ్చింది. ఎక్స్ ఏఐ కంపెనీ డెవలప్ చేసే ఏఐ మోడల్ కు హిందీ భాషలో ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. హిందీలో నిత్యం వినియోగించే అన్ని రకాల వేలాది పదాలను ఏఐ మోడల్ కు నేర్పాలి. ఆయా పదాలను టైప్ చేసినా, వాయిస్ లో చెప్పినా గుర్తు పట్టేలా ఏఐ మోడల్ ను సంసిద్ధం చేయాలి. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనివేళలు ఉంటాయి.
إرسال تعليق