సికింద్రాబాద్ లోని మెట్రోపొలిస్ హోటల్ యజమాని రషీద్, మేనేజర్ రెహమాన్ లను ముత్యాలమ్మ గుడిపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ప్రధాన నిందితుడు మునావర్ కోసం గాలిస్తున్నారు. మునావర్ వ్యక్తిత్వ వికాసం పేరుతో యువకులకు మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు ఇస్తుంటాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రసంగం విన్న ఓ వ్యక్తి హోటల్ సమీపంలోని కుమ్మరిగూడలో గల ముత్యాలమ్మ గుడిపై దాడికి పాల్పడ్డట్లు నిర్ధారించిన పోలీసులు.. హోటల్ నిర్వహకులను అరెస్ట్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా నెలరోజులుగా హోటల్ లో వ్యక్తిత్వ వికాసం పేరుతో క్లాసులు నిర్వహిస్తూ అమాయక యువతను రెచ్చగొడుతున్నట్టు.. దీనిపై చర్యలు తీసుకోవాలని డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్, సికింద్రాబాద్ ఆర్డీవోకు సిఫార్సు చేశారు. ఈ క్రమంలో గురువారం రెవెన్యూ అధికారులు, పోలీసులు కలిసి హోటల్ మీద దాడి చేసి సీజ్ చేశారు. కాగా నేడు హోటల్ నిర్వహకులను అరెస్ట్ చేశారు.
ホーム
/
మేనేజర్ల అరెస్టు
/
ముత్యాలమ్మ గుడి ఘటనలో హోటల్ యజమాని, మేనేజర్ల అరెస్టు !
الاثنين، 21 أكتوبر 2024
Criem secunderabad telangana మరో ప్రధాన నిందితుడు మునావర్ కోసం గాలింపు ముత్యాలమ్మ గుడి ఘటనలో హోటల్ యజమాని మేనేజర్ల అరెస్టు
ليست هناك تعليقات:
إرسال تعليق