ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో జరిగిన వారాహి సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ "ఉప ముఖ్యమంత్రిగానో, పవన్ కళ్యాణ్ గానో ఇక్కడకు రాలేదు. భారతీయుడిగా, సనాతన ధర్మాన్ని పాటించేవాడిగా వచ్చానన్నారు. ఏడు కొండలవాడికి అన్యాయం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటాం. సనాతన ధర్మానికి అవమానం చేస్తూ వచ్చారు. భరించాం. భగవంతుడు వారికి 11 సీట్లే ఇచ్చినా బుద్ధి రాలేదు, నా సనాతన ధర్మాన్ని గౌరవిస్తాను. అన్ని మతాలనూ గౌరవిస్తాను" అని పవన్ కళ్యాణ్ అన్నారు. "నా సనాత ధర్మాన్ని పాటిస్తుంటే కూడా.. తప్పు పడుతున్నారు. గెలిచినా, ఓడినా, ముందుకు పోయేదే నా రాస్తా (దారి). పరాభవం, పరాజయం పొందినా, నా ధర్మంపై నాకు ఉన్న అంచచల విశ్వాసం. సనాతన ధర్మం వైరస్, దాన్ని అంతం చేస్తామంటున్నారు కొందరు. సనాతన ధర్మ విరోధులతో గొడవ పెట్టుకోవడానికే వచ్చాను. అయోధ్య వేడుకను నాట్యగాన సభ అని రాహుల్ గాంధీ అన్నారు. ఆయన ప్రధాని మోదీని, రాముడినీ వ్యతిరేకిస్తారు" అని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. "మనం మన వాయిస్ వినిపించగానే.. మనల్ని విమర్శిస్తారు. మనం తీవ్రంగా గాయపడ్డాం. సెక్యులరిజం అంటే.. హిందూ మతాన్ని దూషించడం, ఇతర మతాల్ని మెచ్చుకోవడమా? దశాబ్దాలుగా చూస్తున్నాం.. ఇదేం కొత్త కాదు. చట్టాలు కూడా సనాతన ధర్మాన్ని పాటించేవారిపై నిర్దాక్షిణ్యంగా పనిచేస్తున్నాయి. అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం చూపిస్తున్నారు. అయిన వాళ్లకు ఆకులు, కాని వాళ్లకు కంచాలు.. ఇదేమీ సరదాగా చెప్పట్లేదు. ఇందుకో ఉదాహరణ ఉంది. సనాతన ధర్మాన్ని ఒక వైరస్ అని ఓ యువ నాయకుడు ఇటీవల అన్నాడు. దాన్ని అంతం చేస్తామన్నాడు. హిందూ మతాన్ని ఎవరైనా ఏమైనా అంటే, కోర్టులు కూడా మాట్లాడవు. భయపడతాయి" అని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఏడు కొండల వాడికి అన్యాయం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటాం !
الخميس، 3 أكتوبر 2024
Andhra Pradesh ఏడు కొండల వాడికి అన్యాయం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటాం వారాహి సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారికి 11 సీట్లే ఇచ్చినా బుద్ధి రాలేదు
ليست هناك تعليقات:
إرسال تعليق