ఏడాదికి 5 మిలియన్ టన్నుల ప్రారంభ సామర్థ్యంతో సమీకృత ఉక్కు కర్మాగారాన్ని స్థాపించడానికి కొరియాకు చెందిన పోస్కో గ్రూప్‌తో జేఎస్‌డబ్ల్యూ ఈరోజు ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్, పోస్కో ఛైర్మన్ చాంగ్ ఇన్ -హవా రెండు వ్యాపార సంస్థల సీనియర్ ఎగ్జక్యూటివ్‌ల సమక్షంలో ముంబైలోని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ కార్పొరేట్ హెడ్‌క్వార్టర్స్‌లో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రతిపాదిత ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించిన అవసరాలను తీర్చడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్, పునరుత్పాదక ఇంధనానికి సంబంధించిన బ్యాటరీ మెటీరియల్స్ రంగాల్లో సహకారాన్ని కూడా రెండు గ్రూప్‌లు అన్వేషించనున్నాయని జేఎస్‌డబ్ల్యూ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్, పోస్కో గ్రూప్ మధ్య సహకారం భారత్‌కు సంబంధించిన ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుందని, రెండు దేశాల్లో సుస్థిరత ప్రయత్నాలకు ముందుకు తీసుకువెళుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్..స్టీల్, ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సిమెంట్, పెయింట్స్, రియాల్టీ, ఈ-ప్లాట్‌ఫామ్స్, మొబిలిటీ, డిఫెన్స్, స్పోర్ట్స్ మొదలగు రంగాల్లో భారత్‌కు చెందిన దిగ్గజ సంస్థ. జేఎస్‌డబ్ల్యూ..భారత్‌తో పాటు యూఎస్, ఇటలీ దేశాల్లో బహుళ ఇంటిగ్రేటెడ్ స్టీల్ కర్మాగారాలను నిర్వహిస్తోంది.
పోస్కో గ్రూప్‌తో జేఎస్‌డబ్ల్యూ అవగాహన ఒప్పందం !
الثلاثاء، 29 أكتوبر 2024
business national ఏడాదికి 5 మిలియన్ టన్నుల ప్రారంభ సామర్థ్యంతో సమీకృత ఉక్కు కర్మాగారాన్ని స్థాపించడానికి పోస్కో గ్రూప్‌తో జేఎస్‌డబ్ల్యూ అవగాహన ఒప్పందం
ليست هناك تعليقات:
إرسال تعليق