గాయకురాలు జయా కిశోరీ ఇటీవల ఎయిర్‌పోర్టులో రూ. రెండు లక్షల విలువైన డియోర్ బ్యాగ్‌తో ఉన్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. దాంతో నెట్టింట్లో తనపై వచ్చిన నెగెటివ్ కామెంట్లపై ఆమె స్పందించారు. ''నేనూ అందరిలాంటి అమ్మాయినే. ఒక సాధారణమైన ఇంట్లో నా కుటుంబంతో కలిసి నివసిస్తున్నాను. కష్టపడి పనిచేయండి. డబ్బు సంపాదించండి. మీతోపాటు మీకుటుంబానికి మంచి జీవితాన్ని ఇవ్వండి. మీ కలలు నెరవేర్చుకోండని యువతకు నేను చెప్తుంటాను'' అని జయా కిశోరీ అన్నారు. అలాగే ఆ బ్యాగ్ లెదర్‌దనే విమర్శలు కూడా వచ్చాయి. వాటిపై ఆమె మాట్లాడుతూ.. ''వినియోగదారులు కోరుకున్నట్టుగా ప్రత్యేకంగా రూపొందించిన బ్యాగ్ ఇది. అందుకే దానిపై నా పేరు కూడా ఉంటుంది. నేనెప్పుడు లెదర్ వాడలేదు. నా మాటలు పూర్తిగా గమనిస్తే ప్రతిదీ మాయ అని నేను ఎప్పుడూ చెప్పలేదు. డబ్బు సంపాదించొద్దు, అన్నింటిని త్యజించండి అని చెప్పలేదు. నేను చేయనివాటిని ఎలా చెప్తాను. నేను సాధ్విని కాదనే స్పష్టత నాకు మొదటి నుంచి ఉంది. ఇదంతా నెగెటివ్ పబ్లిసిటీ'' అని ఆమె చెప్పారు. తనను అనుసరించి, విశ్వసించేవారి కోసమే ఈ వివరణ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రజల విశ్వాసాన్ని పోగొట్టుకునేంత పిచ్చిదాన్ని కాదని వ్యాఖ్యానించారు. ఆమె లగ్జరీ బ్యాగ్‌తో కనిపించిన దృశ్యాలు వైరల్ కావడంతో కొందరు నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ''డబ్బు, వస్తువులపై వ్యామోహం ఉండకూడదనేలా ఆమె బోధనలు ఉంటాయి'' అంటూ కామెంట్లు పెట్టిన నేపథ్యంలో ఆమె స్పందన వచ్చింది.
నేనూ అందరిలాంటి అమ్మాయినే : జయా కిశోరీ
الثلاثاء، 29 أكتوبر 2024
ఎయిర్‌పోర్టులో ఆమె రూ. రెండు లక్షల విలువైన డియోర్ బ్యాగ్‌తో ఉన్న దృశ్యాలు వైరల్ జయా కిశోరీ నేనూ అందరిలాంటి అమ్మాయినే
ليست هناك تعليقات:
إرسال تعليق