Ad Code

యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ పెంపు !


యూపీఐ లావాదేవీలను మరింత ప్రోత్సహించడంలో భాగంగా UPI123Pay లో ప్రతి లావాదేవీ పరిమితిని రూ. 5వేల నుంచి పెంచాలని ఆర్బీఐ నిర్ణయించింది. అందులో రూ. 10వేలు యూపీఐ లైట్ వ్యాలెట్ పరిమితిని రూ. 2వేల నుంచి రూ. 5వేలకు, ప్రతి లావాదేవీ పరిమితిని రూ. 500 నుంచి రూ. వెయ్యికి పెంచినట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.ఆర్బీఐ యూపీఐ 123పే పేమెంట్లపై ప్రతి లావాదేవీ పరిమితిని రూ. 5వేల నుంచి రూ. 10వేలకు పెంచింది. చిన్న మొత్తాల్లో డిజిటల్ పేమెంట్స్ సులభతరం చేసేందుకు వీలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. యూపీఐ లైట్ ఫీచర్ తెచ్చిన సంగతి తెలిసిందే. దీనిని ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి వాటిల్లో వాడుకోవచ్చు. ఇక్కడ కూడా వాలెట్‌ నగదు లిమిట్‌ను రూ. 2 వేల నుంచి ఇప్పుడు 5 వేలకు పెంచింది. ఇంకా ఇక్కడ పర్ ట్రాన్సాక్షన్ లిమిట్ కూడా రూ. 100 నుంచి 500 కు పెంచుతున్నట్లు వెల్లడించింది. యూపీఐ లైట్ పేమెంట్స్‌లో పిన్ ఎంటర్ చేయాల్సిన పని ఉండదు. సింగిల్ క్లిక్‌తో పేమెంట్ పూర్తి చేయొచ్చు. ఇందుకోసం వ్యాలెట్లో కొంత మొత్తం క్యాష్ లోడ్ చేయాలి. దీని లిమిట్‌నే ఇప్పుడు 5 వేలకు పెంచింది. బ్యాంక్ సేవల్లో అంతరాయం ఉన్నా ఇక్కడ ఇబ్బంది ఉండదు.గతంలో యూపీఐ ద్వారా టాక్స్ పేమెంట్స్ లిమిట్ గరిష్టంగా రూ. లక్ష వరకు ఉండగా దీనిని ఆర్బీఐ రూ. 5 లక్షలకు పెంచింది.

Post a Comment

0 Comments

Close Menu