సినీ నటుడు అక్కినేని నాగార్జున  కుటుంబాన్ని, వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు  అంతటా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. న్యాయమూర్తి సెలవులో ఉండటంతో విచారణ వాయిదా పడింది. సోమవారం దీనిపై విచారణ జరగనుంది. కొండా సురేఖ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో సమంత, నాగచైతన్య, నాగార్జున  పేర్లను ప్రస్తావించారు. వారి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు. ఆ మాటలు వైరల్‌గా మారాయి. దీనిపై అక్కినేని కుటుంబం, సమంతతో సహా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు స్పందించారు. కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆధారాల్లేని వ్యాఖ్యలు చేస్తే మౌనంగా చూస్తూ కూర్చోబోమని హెచ్చరించారు. ఇలాంటి కామెంట్స్‌ బాధ్యతారాహిత్యమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.

Post a Comment

Previous Post Next Post