Ad Code

బెంగళూరు, పుణె, ఢిల్లీ - ఎన్సీఆర్‌, ముంబయిలో యాపిల్‌ కొత్త స్టోర్లు !


యాపిల్‌ భారత్‌లో తయారీ, విక్రయ కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. త్వరలోనే మరో నాలుగు యాపిల్‌ రిటైల్‌ స్టోర్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ముంబయి, ఢిల్లీలో ఉన్న స్టోర్లకు వచ్చిన ఆదరణ నేపథ్యంలో విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించింది. భారత్‌లో తమ స్టోర్లను పెంచడంపై యాపిల్‌ రిటైల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డీర్‌డ్రే ఓబ్రియన్‌ ఆనందం వ్యక్తంచేశారు. బెంగళూరు, పుణె, ఢిల్లీ - ఎన్సీఆర్‌, ముంబయిలో కొత్త స్టోర్లు తీసుకొస్తున్నట్లు ఈసందర్భంగా ఆయన వెల్లడించారు. ఐఫోన్‌ 16 సిరీస్‌ ఫోన్ల ఉత్పత్తిని భారత్‌లో ప్రారంభించినట్లు యాపిల్‌ వెల్లడించింది. 'మేడ్‌ ఇన్‌ ఇండియా' ఐఫోన్‌ 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్‌ మోడళ్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. వీటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు ఎగుమతులు చేయనున్నట్లు పేర్కొంది. రానున్న కొన్నేళ్లలో 25శాతం ఐఫోన్ల ఉత్పత్తి భారత్‌లోనే చేయాలని యాపిల్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఐఫోన్‌16 సిరీస్‌ మేడ్‌ ఇన్‌ ఇండియా ఫోన్లు ఈ నెలలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని టెక్‌ నిపుణులు భావిస్తున్నారు. వచ్చే ఏడాదిలో కొత్త స్టోర్లు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. 

Post a Comment

0 Comments

Close Menu