తెలంగాణలోని కొండగట్టులో వంద గదుల నిర్మాణానికి టీటీడీ ముందుకు వచ్చింది. అయితే ఈ గదుల నిర్మాణం కోసం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఆలయ ఈఓ టీటీడీ నుండి వచ్చిన ఇంజనీరింగ్ అధికారులతో కలసి స్థల పరిశీలన చేసారు. అనంతరం ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ కొండగట్టు అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టు బడి ఉంది. గత ప్రభుత్వం వంద కోట్లు ఇస్తామని చెప్పి అంజన్న భక్తులను మోసం చేసింది. తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ల సహకారంతో కొండగట్టును అభివృద్ది చేసుకుంటాం. త్వరలోనే 100 గదుల నిర్మాణం చేపడతాం. అలాగే త్వరలో కొండగట్టు గిరి ప్రదక్షిణ రూట్ మ్యాప్ ఖరారు చేస్తాం అని పేర్కొన్నారు. అయితే ఈ సర్వేలో టీటీడీ నుండి డీఈ పీవీ నాగరాజు, ఏఈ జే నాగరాజులు పాల్గొన్నారు.
కొండగట్టులో వంద గదుల నిర్మాణానికి ముందుకు వచ్చిన టీటీడీ !
السبت، 5 أكتوبر 2024
Andhra Pradesh ఆలయ ఈఓ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొండగట్టులో వంద గదుల నిర్మాణానికి ముందుకు వచ్చిన టీటీడీ టీటీడీ ఇంజనీరింగ్ అధికారులతో కలసి స్థల పరిశీలన
ليست هناك تعليقات:
إرسال تعليق