హైదరాబాద్ లోని హెచ్ఐసిసి నోవాటెల్లో అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) 'అర్బన్ స్ట్రాటజీస్, పాలసీ మరియు రెగ్యులేషన్' పై దృష్టి సారించి, 2వ ఎడిషన్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సును విజయవంతంగా నిర్వహించింది. భారతదేశపు పట్టణ మౌలిక సదుపాయాల కోసం రూపొందించాల్సిన వ్యూహాలు, ఆవిష్కరణలు మరియు విధానాలపై చర్చించడానికి వేదికగా ఈ శిఖరాగ్ర సమావేశం నిలిచింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా , తెలంగాణ ప్రభుత్వ రోడ్లు & భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పట్టణాభివృద్ధిలో కనెక్టివిటీ యొక్క కీలక పాత్రను నొక్కిచెప్పారు. ఆయన మాట్లాడుతూ నగరాభివృద్ధి లో కనెక్టివిటీ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మెట్రో రైలు వ్యవస్థలను విస్తరించేందుకు, రోడ్ నెట్వర్క్లను మెరుగుపరచడానికి మరియు ప్రజా రవాణాను ఆధునీకరించడానికి గణనీయమైన పెట్టుబడులు పెట్టనున్నట్లు మంత్రి తెలిపారు. అంతేకాకుండా, పట్టణ మౌలిక సదుపాయాలు రోడ్లు మరియు రవాణాకు మించినవి అని ఆయన నొక్కి చెప్పారు. స్వచ్ఛమైన నీరు, ఆధారపడతగిన విద్యుత్ మరియు సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ వంటి ముఖ్యమైన సేవలు తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలక భాగాలని, జీవన నాణ్యత పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తాయన్నారు. 19 ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేయాలనే లక్ష్యంతో గౌరవనీయులైన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ కొత్తగా ప్రారంభించిన 'స్పీడ్' కార్యక్రమంపై కూడా ఈ సదస్సులో చర్చలు జరిగాయి. ఫీనిక్స్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియా గౌరవ కాన్సుల్ జనరల్ శ్రీ సురేష్ చుక్కపల్లి ఆర్థిక వృద్ధికి ఇంజిన్లుగా పట్టణ కేంద్రాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.నగరాలు రాష్ట్ర ప్రగతికి ఆయువుపట్టుగా ఉన్నాయన్నారు, ప్రస్తుత, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. పూణేలోని అలర్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పూనమ్ కశ్యప్ భారతదేశంలో వేగవంతమైన పట్టణీకరణకు సంబంధించి సమగ్ర విశ్లేషణను అందించారు. గృహాల కొరత, మౌలిక సదుపాయాల లోటు మరియు పర్యావరణ క్షీణతతో సహా దేశం ఎదుర్కొంటున్న పట్టణ సవాళ్లను ఆమె చర్చించారు. హైదరాబాద్లోని యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్ జనరల్లోని పొలిటికల్ & ఎకనామిక్ విభాగం చీఫ్ శ్రీ ఫ్రాంక్ పి. తల్లుటో, నగర వృద్ధిని నిర్వహించడంలో మరియు రద్దీని తగ్గించడంలో సమర్థవంతమైన పట్టణ ప్రణాళిక మరియు నియంత్రణ పాత్రను వెల్లడించారు. అసోచామ్ తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, హౌసింగ్ & అర్బన్ డెవలప్మెంట్ కన్వీనర్, మరియు ప్రణవ గ్రూప్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & సిటీఓ శ్రీ రాంబాబు బూరుగు మాట్లాడుతూ 2028 నాటికి రాష్ట్ర జనాభాలో 50% పైగా పట్టణవాసులు ఉంటారని, రాష్ట్ర జనాభాలో 40% మంది హైదరాబాద్ నగర జనాభా లో భాగంగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ అనుకూల వృద్ధికి పునాదిగా పట్టణ మౌలిక సదుపాయాలకు తెలంగాణ నిబద్ధతను కో-కన్వీనర్ మరియు స్టీల్ ఎక్స్ఛేంజ్ ఇండియా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ బండి బన్సిధర్ వెల్లడించటంతో సదస్సు ముగిసింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ మచ్చా దినేష్ బాబు కూడా హైదరాబాద్ వృద్ధి కి దోహదపడే కొనసాగుతున్న మరియు భవిష్యత్ ప్రాజెక్టుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమ నాయకులు, ప్రభుత్వ అధికారులు మరియు మౌలిక సదుపాయాల నిపుణులతో సహా దాదాపు 150 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ