ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ప్రధాన నిందితుడు, వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడు చైతన్య కోర్టులో లొంగిపోయారు. ఇంతకాలం అజ్ఞాతంలో ఉన్న ఆయన ఎట్టకేలకు మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. బెయిల్ మంజూరు చేయాలని ధర్మాసనాన్ని కోరారు. టీడీపీ కార్యాలయం దాడిలో చైతన్య ప్రత్యక్షం పాల్గొన్నాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కేసు విచారణ స్పీడందుకోవడంతో చైతన్య కనిపించకుండా పోయారు. మళ్లీ ఇన్నాళ్లకు బయటకు వచ్చారు.

Post a Comment

Previous Post Next Post