Ad Code

స్టేటస్‌ పెట్టి ఆత్మహత్య చేసుకున్న యువకుడు !


హైదరాబాద్ లోని పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో తాను చనిపోతానని వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ ఆసిఫ్‌ అలీ కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ లోని పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు గ్రామానికి చెందిన నాగమణి కుటుంబం పటాన్‌న్‌చెరు డివిజన్‌ పరిధిలోని రామమందిర్‌ రోడ్డులో ఉంటున్నారు. వీరి కుమారుడు ఫణి వర్మ (29) ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఫణి వర్మ వారి బంధువుల అమ్మాయిని ప్రేమించడంతో ఇరువురి కుటుంబ సభ్యులు మాట్లాడుకొని సంవత్సరం తర్వాత వివాహం చేద్దామని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో 12న ఫణివర్మ తల్లి నాగమణి డ్యూటీకి వెళ్లగా, ఇంట్లో ఒంటరిగా ఉన్న ఫణివర్మ ''నేను చనిపోతున్నాను''అని వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టాడు. ఇది చూసిన కుటుంబ సభ్యులు వెంటనే ఇంటికి వచ్చి చూడగా గడియ పెట్టి ఉంది. కిటికి అద్దం పగులగొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి ఫ్యాన్‌కు తాడుతో ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu