Ad Code

శామ్‌సంగ్‌ గెలాక్సీ S25 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌ త్వరలో విడుదల !


శామ్‌సంగ్‌ గెలాక్సీ S25 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో విడుదల  చేయనున్నట్లు లీకేజీలను బట్టి తెలుస్తోంది. అనేక అప్‌గ్రేడ్‌ ఫీచర్లతో ఈ మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. శామ్‌సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ కోసం ఫోటోగ్రఫీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. హై క్వాలిటీ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కోసం చూస్తున్నవారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పవచ్చు. ముఖ్యంగా కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్ల్ఫుయెన్సర్లను గెలాక్సీ ఎస్‌25 అల్ట్రా 5జీ ఆకట్టుకునే అవకాశం ఉంది. శామ్‌సంగ్‌ గెలాక్సీ S25 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌ 6.8 అంగుళాల QHD డిస్‌ప్లేతో రానుంది. ఈ స్క్రీన్ 1450×3120 పిక్సెల్‌ రిజల్యూషన్‌తో స్పష్టమైన విజువల్స్‌ను అందిస్తుంది. దీనిలో 4K వీడియో సపోర్ట్‌ను అందించనున్నట్లు లీకేజీలను బట్టి తెలుస్తోంది. గెలాక్సీ S25 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌లో 5000mAh బ్యాటరీని అందించనుంది. ఈ ఫోన్‌ 120 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీన్ని కేవలం 30 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌లో 400MP AI మెయిన్‌ కెమెరా ఉంటుందని పుకార్లను బట్టి తెలుస్తోంది. దీనిలో అడ్వాన్స్‌డ్ AI- పవర్డ్ ఇమేజ్ ప్రాసెసింగ్‌ ఫీచర్‌ను సైతం అందించే అవకాశం ఉంది. మరోవైపు, కెమెరా సెటప్‌లోని 32MP అల్ట్రా-వైడ్, 16MP డెప్త్ సెన్సార్‌ కెమెరాలు హైక్వాలిటీ ఫోటోలను తీయగలవు. ఇవన్నీ కంటెంట్ క్రియేటర్ల అవసరాలకు సరిపోతాయి. సెల్ఫీ లవర్స్ కోసం 50MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉండవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. 12GB ర్యామ్‌ + 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 12GB ర్యామ్‌ + 512GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 16GB ర్యామ్‌ + 1TB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్లలో మార్కెట్‌లోకి రిలీజ్‌ కానుంది. శామ్‌సంగ్‌ గెలాక్సీ S25 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 1,29,999 నుండి రూ. 1,34,999 మధ్య ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లాంచింగ్‌ ఆఫర్‌ కింద దీన్ని రూ. 131,999 నుండి రూ. 132,999 మధ్య విక్రయించే అవకాశం ఉంది. అయితే, లాంచింగ్‌ నాటికి ధర, ఫీచర్లలో మార్పులు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి, లాంచింగ్‌ డేట్‌పై శామ్‌సంగ్‌ కంపెనీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ వచ్చే ఏడాది జనవరి చివరిలో లేదా ఫిబ్రవరిలో రిలీజ్‌ కానుందని లీకేజీలను బట్టి తెలుస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu