యూట్యూబర్ హర్షసాయి బాధితురాలు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేసింది. హర్షసాయి సోషల్ మీడియాలో తన మీద నెగెటివ్ ట్రోలింగ్ చేయిస్తూ మానసికంగా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనను ఉద్దేశపూర్వకంగా ట్రోల్ చేస్తున్న వారిపై, అవన్నీ చేయిస్తున్న హర్షసాయి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఫిర్యాదులో కోరింది. అందుకు సంబంధించిన పలు సోషల్ మీడియా అకౌంట్ల స్క్రీన్ షాట్స్ ను పోలీసులకు అందించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు త్వరలోనే వారిపై చర్యలు తీసుకుంటామని బాధితురాలికి హామీ ఇచ్చారు.

Post a Comment

Previous Post Next Post