ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ  అసలు పవన్ కల్యాణ్‌కి సనాతన ధర్మం అంటే తెలుసా ? అని ప్రశ్నించారు. చంద్రబాబు తప్పు చేశారని కళ్లెదుటే కనిపిస్తుంటే, వేంకటేశ్వర స్వామి ప్రతిష్ఠను, లడ్డూ విశిష్టతను తగ్గిస్తూ, కావాలని రాజకీయ దుర్బుద్ధితో కోట్ల మంది హిందువుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీస్తుంటే దాన్ని ఖండించడం మానేసి అందులో పవన్ కూడా భాగమయ్యారని, బాబుతో కలిసి అబద్ధపు ఆరోపణలు చేస్తూ ముందుకు అడుగులు వేస్తున్నారని, ఇదెలా సనాతన ధర్మాచరణ అవుతుందని జగన్ ప్రశ్నించారు. అబద్ధాలకు మద్దతుగా నిలుస్తున్న వ్యక్తి సనాతన ధర్మం గురించి మాట్లాడడం ఏంటని నిలదీశారు. తప్పు అని తెలిసినా దాన్ని ఎత్తి చూపకపోగా తప్పును గుడ్డిగా సమర్థిస్తూ అందులోనూ దేవుడి విషయంలో తప్పు చేస్తూ అదే సనాతనం అని చెప్పడం ఎంత వరకు ధర్మమని జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Post a Comment

Previous Post Next Post