ఆంధ్రప్రదేశ్‌లో దీపం-2 పథకానికి ప్రభుత్వం రూ.2,684 కోట్లు మంజూరు చేసింది. మొదటి విడతకు అయ్యే ఖర్చు 894 కోట్ల రూపాయల మొత్తాన్ని పెట్రోలియం సంస్థలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు అందజేశారు. నిన్నటి నుంచి అమల్లోకి వచ్చేసింది దీపం -2 పథకం.. ఇక, 1వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో ఈ పథకాన్ని లాంఛనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. సచివాలయంలో హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థల ప్రతినిధులకు ఈ సబ్సిడీ మొత్తాన్ని ఈ రోజు అందించారు సీఎం చంద్రబాబు.. ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. ఇక, పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు తెనాలి నుంచి వచ్చిన దీపం పథకం లబ్దిదారు బాలమ్మ, ఏలూరు నుంచి వచ్చిన లబ్దిదారు భవానీ, విజయవాడ నుంచి వచ్చిన లబ్దిదారు మంగతాయారు, సివిల్ సప్లై శాఖ అధికారులు, పెట్రోలియం సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..
దీపం-2 పథకానికి రూ.2,684 కోట్లు మంజూరు !
الأربعاء، 30 أكتوبر 2024
684 కోట్లు మంజూరు Andhra Pradesh దీపం-2 పథకానికి రూ.2 మొదటి విడతకు అయ్యే ఖర్చు 894 కోట్ల రూపాయల అందజేత శ్రీకాకుళం జిల్లాలో 1న లాంఛనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు
ليست هناك تعليقات:
إرسال تعليق