ఉత్తరాంధ్రలోని పలు జలాశయాలు ప్రమాదకర స్థాయిని దాటాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో రాకపోకలు స్తంభించాయి. భారీ వర్షం వల్ల అనకాపల్లి జిల్లా కోటవురట్లలో వ్యవసాయ సహకార బ్యాంకు జలదిగ్బంధమైంది. ప్రధాన రహదారితోపాటు సమీపంలోని ఇళ్లు నీటమునిగాయి. నర్సీపట్నం మండలం వేములపూడి వద్ద ఏలేరు కాలువ 82వ కిలోమీటర్ సమీపంలో కాల్వ లైనింగ్‌ను మించి నీటి ప్రవాహం కొనసాగుతోంది. గండిపడే అవకాశం ఉండటంతో రైతులే స్వయంగా మట్టి బస్తాలను మోసుకొచ్చి ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. భారీ వర్షాలకు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉపమాక సమీపంలోని జగనన్న కాలనీ ముంపునకు గురైంది. మోకాళ్లలోతు నీరు రావడంతో బయటకు రాలేక స్థానికులు అవస్థలు పడుతున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం కల్యాణపులోవ జలాశయం నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. జలాశయం నాలుగు గేట్లు ఎత్తి.. నీటిని దిగువున ఉన్న వరాహ నదిలోకి విడుదల చేస్తున్నారు. సీలేరు జలాశయానికి వరద నీరు పోటెత్తింది. జలాశయం నాలుగు గేట్లు ఎత్తి.. 13వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పిల్లి గడ్డ వంతెన కొట్టుకుపోయింది. ఫలితంగా ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. డొంకరాయ్ జలాశయం నుంచి 1.10 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
కుండపోత వర్షాలకు ఉత్తరాంధ్రలో పొంగిపొర్లుతున్న వాగులు !
الاثنين، 9 سبتمبر 2024
Andhra Pradesh ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో రాకపోకలు స్తంభించాయి ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు కుండపోత వర్షాలకు ఉత్తరాంధ్రలో పొంగిపొర్లుతున్న వాగులు
ليست هناك تعليقات:
إرسال تعليق